మహేష్, బన్నీ అసలు తగ్గడం లేదుగా..!

Published on Jan 17, 2020 10:00 pm IST

ప్రమోషన్స్ విషయంలో మహేష్ అండ్ బన్నీ అస్సలు తగ్గడం లేదు. అటు కలెక్షన్స్ మరియు రికార్డ్స్ విషయంలో నువ్వా నేనా అనిపోటీపడుతున్నారు. ఇక నేడు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రం నుండి సిత్తరాల సిరపాడు అనే లిరికల్ వీడియో విడుదల చేశారు. అల వైకుంఠపురంలో చిత్రంలో ఓ ఫైట్ సీక్వెన్స్ లో వచ్చే ఈ పాట థియేటర్ లో ఓ రేంజ్ లో పేలింది. దీనితో సిత్తరాల సిరపాడు లిరికల్ వీడియోని నేడు విడుదల చేశారు. ఇక మరో ప్రక్క మహేష్ టీం ఓ సాంగ్ ప్రోమో వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సరిలేరు నీకెవ్వరు మూవీ మొత్తం సాంగ్స్ లో సూపర్ అనిపించుకున్న మైండ్ బ్లాక్ సాంగ్ వీడియో ప్రోమో ని కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. మహేష్ బాబు గ్రేస్ స్టెప్స్ ఈ పాటలో వెండితెరపై అద్భుతం చేశాయి. థియేటర్ లో ఈ సాంగ్ ని ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. మహేష్ అండ్ రష్మిక ల ఎనర్జిటిక్ స్టెప్స్ తో కూడిన, మైండ్ బ్లాక్ వీడియో ప్రోమో విడుదల చేశారు. నిన్నటితో పండుగ ముగిసిన నేపథ్యంలో నేటి నుండి మొదలు కానున్న వీకెండ్ వసూళ్లకు చాలా కీలకం, అందుకే ఈ రెండు చిత్రాల టీమ్స్ ప్రమోషన్స్ కొంచెం గట్టిగా నిర్వహిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More