ఆ కార్చిచ్చు పై మహేష్ కూడా స్పందించారు.

Published on Aug 23, 2019 9:45 pm IST

బ్రెజిల్ దేశంలోని ప్రపంచంలోనే అతి పెద్ద రైన్ ఫారెస్ట్ అయిన అమెజాన్ రెండు వారాలుగా కార్చిచ్చుతో తగలబడిపోతుంది. లక్షల ఎకరలాల మేర పచ్చని అడవి బూడిదై పోతుంది. పర్యావరణం తో పాటు, జీవవైవిధ్యం ఆ మంటల ధాటికి నాశనమై పోతుంది. దీనితో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

కొన్ని రోజులుగా బాలీవుడ్ తారలు ఈ విషయం పై వరుస ట్వీట్ లు చేస్తూ దిగ్ర్బాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విపత్కర సంఘటనపై టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పందించారు. ట్విట్టర్ వేదికగా , దిగ్ర్బాంతికర వార్త, ప్రపంచ ఊపిరి తిత్తులుగా పిలువబడే అమెజాన్ ఫారెస్ట్ మంటలలో చిక్కుకుంది. ప్రపంచానికి 20% ఆక్సిజన్ అందిస్తున్న అమెజాన్ ని ఎలా కాపాడాలని ఆయన వెల్లడించడం జరిగింది.

సంబంధిత సమాచారం :