మహేష్ 25 నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే !

మహేష్ 25 నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే !

Published on Jul 18, 2018 2:24 PM IST


‘భరత్ అనే నేను’ చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ చిత్రంలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవల డెహ్రాడూన్ లో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

ఇక ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ గోవా వెళ్లనుందని సమాచారం. పూజా హెగ్డే కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ హీరో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు పివిపి ,దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో రానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు