మహేష్, త్రివిక్రమ్ ల ప్రాజెక్ట్ మొదలు అప్పుడే.?

Published on Jun 1, 2021 8:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇంకా మహేష్ చేతిలో ఉండగానే తన హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూడో సినిమా ప్రకటించి సెన్సేషన్ ను నమోదు చేశారు.

అయితే ఈ భారీ చిత్రంను కూడా సర్కారు వారి పాట షూట్ తోనే ఏక కాలంలో కంప్లీట్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ చిత్రం అన్ని బాగుంటే నిన్ననే సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా మొదలు పెడతారని టాక్ వచ్చింది. కానీ అది జరగలేదు. మరి ఈ చిత్రం ఎప్పటి నుంచి మొదలు కానుంది అన్న దానిపై స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.

ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే జూలై నుంచి స్టార్ట్ చేయనున్నారట. అక్కడ నుంచే రెగ్యులర్ షూట్ కూడా ఉండనున్నట్టు తెలుస్తుంది. మరి ఈసారి త్రివిక్రమ్ మహేష్ ను అలాంటి క్లాసిక్ రోల్ లో చూపించనున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :