తన 25వ సినిమా విశేషాల్ని బయటపెట్టిన మహేష్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ విడుదలగానే తన 25వ సినిమా పనుల్ని మొదలుపెట్టనున్నారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. ఈ సిల్వర్ జూబ్లీ సినిమా గురించి మాట్లాడిన మహేష్ సినిమా జూన్ నుండి మొదలవుతుందని అన్నారు.

ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి, సినిమాటోగ్రఫర్ పిఎస్. వినోద్, ఆర్ట్ డైరెక్టర్ కలిసి అమెరికాలో లొకేషన్స్ వెతుకుతున్నారని, సినిమా ఎక్కువ భాగం అమెరికాలోనే షూటింగ్ జరుపుకుంటుందని, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ సిద్ధం చేశారని చెప్పారు. పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.