మహేష్ బాబు మాట సహాయం !
Published on Nov 11, 2017 5:02 pm IST

రాజశేఖర్ హీరోగా తాజాగా విడుదలైన గారుడవేగా సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. విడుదల తరువాత అన్ని ఏరియాల్లో థియేటర్స్ పెరిగాయి. మౌత్ టాక్ తో అన్ని షోస్ ఫుల్ అవుతున్నాయి. ఇప్పటికే చిత్రం చుసిన చాలా మంది సినీ ప్రముఖులు ప్రశంశల వర్షం కురిపించారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాపై తన స్పందన తెలిపారు. గారుడవేగ లో స్క్రీన్ ప్లే నటీనటుల నటన తో పాటు టీం వర్క్ బాగుందని అభినందించారు. సినిమా చూసి స్టన్ అయ్యానని తెలిపాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎం.కోటేశ్వర రావ్ నిర్మించారు. మహేష్ మాట సహాయంతో కలెక్షన్స్ మరింత పెరగాలని కోరుకుందాం.

 
Like us on Facebook