‘అల్లుడు శీను’ సినిమా తర్వాత మరో సినిమాను ప్రారంభించలేదు దర్శకుడు వివి వినాయక్. మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమాతో పాటు మహేష్ బాబు నెక్స్ట్ సినిమా, అక్కినేని వారసుడు అఖిల్ తొలి సినిమాకు వినాయక్ దర్శకత్వం వహిస్తారని వార్తలొస్తున్నాయి. వీటిని వినాయక్ ఖండించలేదు, అలాగని ధ్రువీకరించలేదు. మూడు సినిమాలు చర్చల దశలోనే ఉన్నాయని చెప్పారు.
మహేష్ బాబుతో తప్పకుండా సినిమా ఉంటుంది. ఇంకా స్క్రిప్ట్ ఫైనలైజ్ కాలేదు. అఖిల్ సినిమాపై మరో వారం రోజుల్లో వివరాలు వెల్లడిస్తాను. ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కథా చర్చలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏ సినిమా చేయబోతున్నాను అనే విషయంలో ఓ క్లారిటీ వస్తుందని వినాయక్ తెలిపారు.
ప్రస్తుతానికి ‘అల్లుడు శీను’ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాను. త్వరలో నా నెక్స్ట్ సినిమా గురించి ఓ అనౌన్స్మెంట్ ఇస్తాను. అని అన్నారు వివి వినాయక్. అక్టోబర్ 09, ఈ రోజు వినాయక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంగతులు వెల్లడించారు.


