మహేష్, బన్నీ అభిమానులకు ఈ ఏడాది ఎదురుచూపులు తప్పవు..!

mahesh babu 1

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సందడి ఒక రేంజ్‌లో ఉండబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదిని గ్రాండ్‌గా ప్రారంభించగా, సమ్మర్ రేసులో మెగా హీరోలందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ వంటి అగ్ర హీరోలందరూ ఈ ఏడాదే తమ చిత్రాలను విడుదల చేస్తున్నారు.

​అయితే, మహేష్ బాబు, అల్లు అర్జున్ మాత్రం ఈ ఏడాది రేసులో లేరు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ‘వారణాసి’ ప్రస్తుతం 50% షూటింగ్ పూర్తి చేసుకుని, 2027 వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ మూవీ కూడా 30% మాత్రమే పూర్తయింది; ఇది కూడా వచ్చే ఏడాది వేసవిలోనే విడుదల కానుంది.

​బన్నీ ఈ ఏడాది లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించనున్నారు. దీనివల్ల 2026లో ఆయనకు రిలీజ్ ఉండదు కానీ, 2027లో మాత్రం రెండు సినిమాలతో రాబోతున్నారు. నాని, విజయ్ దేవరకొండ, నిఖిల్ వంటి మిగిలిన హీరోలందరూ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుండగా, మహేష్, బన్నీ ఫ్యాన్స్ మాత్రం మరో ఏడాది వేచి చూడక తప్పదు.

Exit mobile version