మహేశ్ బాబు కోసం ట్రై చేస్తోన్న హిట్ డైరెక్టర్ ?

Published on Mar 1, 2019 3:07 am IST

కామెడీని హ్యాండిల్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేస్తోన్న డైరెక్టర్. డైలాగ్ రైటర్ గా కెరీర్ మొదలు పెట్టి .. సక్సెస్ ఫుల్ సినిమాల డైరెక్టర్ గా ఎదిగాడు. ఇటీవలే ‘ఎఫ్ 2’తో భారీ హిట్ ను కొట్టాడు.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి నెక్స్ట్ ఫిల్మ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అనిల్ తన తరువాత చెయ్యబొయ్యే సినిమా కోసం స్క్రిప్ట్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే అనిల్, ఈ స్క్రిప్ట్ ను మహేష్బాబు కోసం రాస్తున్నాడట. మహేష్ కు లైన్ ను కూడా వినిపించాడట. ఒకవేళ మహేష్ అనిల్ కాంబినేషన్ సెట్ అయితే, ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :