విలక్షణ దర్శకుడు క్రిష్, మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా పరిచయమైన హీరో వరుణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘కంచె’. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ రానటువంటి ఓ సరికొత్త కథాంశం, నేపథ్యంలో నడిచే కథతో తెరకెక్కిన ఈ సినిమాపై టీజర్ రిలీజ్ అప్పట్నుంచే విపరీతమైన అంచనాలు మొదలయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యానికి ఒక ప్రేమకథను లింక్ చేస్తూ రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఈ ఉదయం దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదలైన విషయం తెలిసిందే.
ఇప్పటికే పోస్టర్స్, టీజర్‌తో విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా, నేడు విడుదలైన ట్రైలర్‌తో ఎక్కడికో వెళ్ళిపోయింది. తెలుగు సినిమాకు ఓ సరికొత్త గుర్తింపు తెచ్చే సినిమాగా ‘కంచె’ నిలుస్తుందనే అభిప్రాయాలు సైతం ఇప్పట్నుంచే వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే.. ఈ ట్రైలర్ విడుదలైనప్పట్నుంచీ సినీ ప్రముఖుల నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, అల్లు అర్జున్ లాంటి ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించగా, తాజాగా ఆ లిస్ట్‌లో సూపర్ స్టార్ మహేష్ కూడా చేరిపోయారు.
కొద్ది సేపటి క్రితం ‘కంచె’ ట్రైలర్‌పై మహేష్ ప్రశంసలు కురిపిస్తూ.. “కంచె ట్రైలర్ స్టన్నింగ్‌గా ఉంది. కంచె టీమ్‌కు ఆల్ ది బెస్ట్” అంటూ ట్వీట్ చేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్‌తో పాటు ఎంతో మంది స్టార్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్‌తో కంచె టీమ్ ఫుల్ హ్యాపీగా ఉంది. సెప్టెంబర్ 12న కంచె ఆడియో విడుదల కానుండగా, అక్టోబర్ 2న గాంధీ జయంతికి సినిమా విడుదల కానుంది.


