‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’కి మహేష్ బాబు ప్రశంశలు

‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’కి మహేష్ బాబు ప్రశంశలు

Published on Jun 23, 2015 4:00 PM IST

mahesh-babu-sudeer-babu
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న యంగ్ హీరో సుదీర్ బాబు. వరుసగా డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుధీర్ బాబు లేటెస్ట్ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఒక కుర్రాడి లైఫ్ లో మూడు దశల్లో జరిగిన ప్రేమకథగా వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో కలెక్షన్స్ కూడా బాగున్నాయి. అంతే కాకుండా వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ స్టడీగా ఉండడంతో ఈ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చాలా హ్యాపీగా ఉన్నాడు.

ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ ఈ సినిమా చాలా బాగుందని చెప్పారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమాపై ప్రశంశల కురిపించాడు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ చూసాను.. మనసుకు హత్తుకునే స్వచ్చమైన ప్రేమకథ. బాగా ఎంజాయ్ చేసాను. సుధీర్ బాబు ఒక మంచి యాక్టర్ గా సూపర్బ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అతని పెర్ఫార్మన్స్ బాగా నచ్చింది. టీం మొత్తానికి కంగ్రాచ్యులేషన్స్’ అని మహేష్ బాబు ట్వీట్ చేసాడు. సుధీర్ బాబు మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో చాలా బాగా చేసాడని అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకులు తనపై ప్రశంశల జల్లు కురిపించారు. లగడపాటి శ్రీధర్ – శిరీష కలిసి నిర్మించిన ఈ సినిమాలో నందిత హీరోయిన్ గా కనిపించింది.

తాజా వార్తలు