
‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మోత్సవం’. నవంబర్ చిఅరి నుంచి ఈ సినిమా మూడవ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. మాకు అందిన సమాచారం ప్రకారం నిన్నటితో హైదరాబాద్ లో మూడవ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, సత్యరాజ్, రేవతి, ప్రణితలపై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. దాంతో రెండు రోజుల గ్యాప్ తర్వాత ఈ చిత్ర టీం తదుపరి షెడ్యూల్ కోసం ఊటీకి వెళ్లనుంది.
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల అంటే టీం ఊటీ షెడ్యూల్ కి కావాల్సిన అన్ని పనులను పూర్తి చేస్తున్నారు. దిసేమ్పార్ 10పైన స్టార్ కానున్న ఈ ఊటీ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకూ కంటిన్యూగా జరగనుంది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాలో మనసుకు హత్తుకునే కుటుంబ విలువలతో పాటు, సూపర్బ్ రొమాంటిక్ ట్రాక్స్ కూడా రాసాడని సమాచారం. ఈ సినిమాలో సమంత, కాజల్ అగర్వాల్, ప్రణితలు మహేష్ బాబుతో రొమాన్స్ చేయనున్నారు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో షూట్ చేసి సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ డైరెక్టర్.

