బళ్ళారిలో మహేష్ బాబుకి భారీ రెస్పాన్స్

బళ్ళారిలో మహేష్ బాబుకి భారీ రెస్పాన్స్

Published on Jun 29, 2014 12:02 PM IST

Mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న సాయంతం బళ్లారిలో కన్నడ టాప్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘పవర్’ ఆడియో కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ ఆడియో వేడుకకి మహేష్ బాబు కోసం భారీగా అభిమానులు తరలి వచ్చారు. బళ్లారిలో ఎక్కువగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండడం వల్ల చాలా మంది మహేష్ బాబు కోసం ఈ ఆడియో వేడుకకి వచ్చారు.

‘పవర్’ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయిన ‘దూకుడు’కి రీమేక్. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు ఈ సినిమాని నిర్మించడం వలన మహేష్ బాబు ఈ మూవీ ఆడియో లాంచ్ కి వచ్చాడు. ప్రస్తుతం మహేష్ బాబు ‘ఆగడు’ షూటింగ్ బళ్లారిలో జరుగుతోంది. జూలై 2 వరకూ అక్కడే షూటింగ్ జరుపుకోనుంది.

తాజా వార్తలు