మహేష్ వీరాభిమాని మృతి

Published on Nov 2, 2019 7:12 pm IST

మహేష్ బాబు వీరాభిమాని రాము ఈరోజు డెంగ్యూ తో మృత్యువాత పడ్డాడు. రాము, సూపర్ స్టార్ మహేష్ బాబుకు వీరాభిమాని. దాంతో మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదిక గా అతని మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ణ అభిమాని డ్రామా జూనియర్స్ ఫేమ్ గోకుల్ కూడా డెంగ్యూ తో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ అభిమాని కూడా డెంగ్యూ కు బలైయ్యాడు.

ఇక ప్రస్తుతం మహేష్ బాబు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటుంది. అందులో భాగంగా పొల్లాచ్చి లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తుండగా, దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :