సెన్సేషనల్ వరల్డ్ రికార్డ్ సెట్ చేసిన మహేష్ ఫ్యాన్స్..!

Published on Jan 25, 2021 8:32 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పేరిట ఇప్పటికే ఎన్నెన్నో అదిరిపోయే రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే. మరి అలా బాక్స్ ఆఫీస్ దగ్గర మహేష్ రికార్డులు తెలిస్తే సోషల్ మీడియాలో మాత్రం మహేష్ ఫ్యాన్స్ నెవర్ బెఫోర్ రికార్డ్స్ సెట్ చేస్తారు అలాగే స్టార్ట్ చేస్తారు.
మరి అలా లేటెస్ట్ గా ఏకంగా ఇండియా లోనే కాకుండా వరల్డ్ మొత్తం లోనే సెన్సేషనల్ రికార్డ్ నెలకొల్పి దుమ్ము లేపారు. గత కొంత కాలం నుంచి మహేష్ చేస్తున్న “సర్కారు వారి పాట” సినిమా హాష్ టాగ్ ను ట్విట్టర్ ట్రెండ్ చేస్తూ మిలియన్స్ కొద్దీ ట్వీట్స్ తో అదరగొట్టారు.

ఇప్పుడు ఆ మార్క్ కాస్తా 100 మిలియన్ క్రాస్ అయ్యింది. దీనితో ప్రపంచంలోనే ఏ సినిమా టాగ్ కూడా టచ్ చెయ్యని వరల్డ్ రికార్డ్ ను మహేష్ ఫ్యాన్స్ చేసి చేసి ఒక సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఇది మాత్రం ప్యూర్ మహేష్ ఫ్యాన్స్ ర్యాంపేజ్ అనే చెప్పాలి. మరి ఈ సాలిడ్ చిత్రాన్ని పరశురాం పెట్ల దర్శకత్వం వహించనుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More