సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సంచలన చిత్రమే ‘వారణాసి’. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ వరల్డ్ సినిమాని విట్నెస్ చేసేందుకు అభిమానులు సహా పాన్ వరల్డ్ ఆడియెన్స్ కూడా ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే అనేక లీక్ లు మాత్రం ఈ సినిమాని ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఈ ఆగష్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఓ బిగ్ అప్డేట్ ని అభిమానులు ఆశించారు. కానీ ఈ గ్యాప్ లోనే సినిమా నుంచి మరో షాకింగ్ లీక్ వచ్చి అందరినీ ఆశ్చర్యానికి లోను చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఎగ్జైట్ అయ్యిపోతున్నారు. మరికొందరు ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా ఇలాంటి షేర్ చేయొద్దని మనవి చేసుకుంటున్నారు.
కానీ దాదాపు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ గానే ఉన్నారు. సో ఎలాగో మిస్టేక్ అయితే వైరల్ అయ్యిపోయింది. సో ఇక చిత్ర యూనిట్ నుంచి ఏమంత బిగ్ అప్డేట్ రాకపోయినా ఫ్యాన్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే అనుకోవాలి. మరి మేకర్స్ ప్లాన్ ఎలా ఉందో ఈ రెండు రోజుల్లో తేలిపోతుంది.


