ఇండియన్ మోస్ట్ డిజైరబుల్ మెన్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రతి ఒక్క హీరోయిన్ నటించాలని కోరుకుంటున్నారు. మహేష్ సరసన అయితే తెలుగులో నటించడానికి ఓకే అంటూ ముంబై ముద్దుగుమ్మలు మీడియా ముందు బహిరంగంగా పలు సందర్భాలలో వెల్లడించారు. మరి మహేష్ బాబు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా..? అతిలోక సుందరి శ్రీదేవి అంటే చిన్నప్పటి నుండి ఇష్టమని తెలిపారు. ఇప్పటికి శ్రీదేవి ఫ్యాన్ అని చెప్పారు.
ఈటీవీలో ప్రసారమైన ‘మనసంత మహేష్’ కార్యక్రమంలో తన ఫేవరెట్ హీరో, హీరోయిన్, సినిమాల గురించి చెప్పారు. ‘ఒక్కడు’ ఫేవరెట్ ఫిల్మ్ . అలాగే ‘పోకిరి’, ‘దూకుడు’ సినిమాలంటే ఇష్టం, అవి నాకు కొత్త ఇమేజ్, స్టార్ డం తీసుకొచ్చాయి. అని చెప్పారు.
‘దూకుడు’ తర్వాత శ్రీను వైట్ల కాంబినేషన్లో మహేష్ బాబు చేస్తున్న ‘ఆగడు’ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు.


