అల్లు అర్జున్ సరసన మహేష్ హీరోయిన్ ?

అల్లు అర్జున్ సరసన మహేష్ హీరోయిన్ ?

Published on Nov 1, 2018 12:05 PM IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తన తరువాత చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే బన్నీ కోసం త్రివిక్రమ్ గతంలోనే ఓ స్క్రిప్ట్ రాశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఆ స్క్రిప్ట్ పైనే వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. డిసెంబర్ 11న ఈ చిత్రం అధికారికంగా లాంచ్ కానుంది.

కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో బన్నీకి జోడీగా కైరా అద్వానీని తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించుకుందని తెలుస్తోంది. మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం కైరా రామ్ చరణ్ సరసన నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు