SSMB28 గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన సూపర్ స్టార్ …. !

SSMB28 గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన సూపర్ స్టార్ …. !

Published on Aug 9, 2022 1:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒక భారీ ప్రాజక్ట్ ని రూపొందించనున్న విషయం తెలిసిందే. మరికొద్దిరోజుల్లో పట్టాలెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక SSMB28 మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాగా, ఈ మూవీలో తన రోల్ కోసం మరోవైపు ఫుల్ గా క్రాఫ్, మీసం, గడ్డం పెంచి సిద్ధం అయ్యారు సూపర్ స్టార్. థమన్ మ్యూజిక్ అందించనున్న ఈ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ మూవీని నిర్మించనున్నారు.

మొదటి నుండి అందరిలో భారీ హైప్ ఏర్పరిచిన ఈ మూవీ గురించి నేడు మహేష్ బాబు పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. తనకు ఎంతో ఇష్టమైన మాటల రచయుత త్రివిక్రమ్ అని,ఆయన దర్శకత్వంలో మూవీ చేస్తున్నప్పుడల్లా మంచి కిక్ ఉంటుందని అన్నారు. తామిద్దరి కాంబినేషన్ లో దాదాపుగా పుష్కర సమయం తరువాత వస్తున్న మూవీ కావడంతో అందరి అంచనాలు అందుకునేలా త్రివిక్రమ్ మంచి పవర్ఫుల్ స్టోరీ రెడీ చేసారని అన్నారు. మేమిద్దరం కలిసి ఇప్పటివరకు చేయని ఒక డిఫరెంట్ వేలో ఈ మూవీ సాగుతుందని, అలానే తన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ ఈ మూవీ ఆకట్టుకుంటుందని అన్నారు మహేష్ బాబు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు