హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్.. నిజం ఎంత..?

హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్.. నిజం ఎంత..?

Published on Feb 12, 2015 3:54 PM IST

mahesh-babu

సూపర్ స్టార్ మహేష్ బాబును హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు వస్తున్న వార్తలు ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశం అయ్యాయి. ది బెస్ట్ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడానికి కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మహేష్ బాబుకు అభిమానులు ఉన్నారు. తెలుగు తెరపై తిరుగులేని ఇమేజ్ కల మహేష్ మేనియా భాగ్య నగరం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచుతుందని భావిస్తున్నారట. ఇందుకు గాను మహేష్ ను ఒప్పించే విధంగా చర్చలు జరుపుతున్నారట.

సాధారణంగా రాజకీయాలకు, వివాదాలకు మహేష్ బాబు వీలైనంత దూరంగా ఉంటారు. మహేష్ ఎంతగానో అభిమానించే, ఆయన బావ జయదేవ్ గల్లా తెలుగుదేశం పార్టీ తరపున ఎంపిగా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో జయదేవ్ గల్లాకు మద్దతుగా మహేష్ ట్వీట్ చేశారు తప్ప, ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. ఈ పరిణామాల నేపధ్యంలో.. కేసీఆర్‌ ఆఫర్‌కు మహేష్ బాబు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. సున్నితంగా తిరస్కరించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వార్తలో నిజం ఎంతుంది..? మహేష్ స్పందన ఏంటో..? తెలియాలంటే అభిమానులు కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

తాజా వార్తలు