సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ ఇచ్చిన సూపర్ సక్సెస్ తో తన 40వ పుట్టిన రోజుని చాలా హ్యాపీగా జరుపుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద విజయంగా నమోదవుతోంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు తన పుట్టిన రోజు సందర్భంగా సొంత యు ట్యూబ్ చానల్ ని లాంచ్ చేసాడు. మహేష్ బాబు అనే పేరు మీద క్రియేట్ చేసిన ఈ యు ట్యూబ్ ఛానల్లో మొదటగా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే ఎపిసోడ్ ని అప్లోడ్ చేసారు.
ఈ వీడియోలో ‘ చిన్నప్పటి నుంచి మహేష్ బాబు పుట్టిన రోజు అంటే చాలా గ్రాండ్ గా జరుపుకుంటాం, కానీ తను స్టార్ హీరో అయ్యాక చాలా సిపుల్ గా సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఆ రోజు చాలా ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. తను ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నానని’ కృష్ణ తెలిపాడు. శ్రీమంతుడు సినిమా సక్సెస్ అవ్వడంతో మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారు. మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు తమ ఫస్ట్ సినిమానే హిట్ కావడంతో వారు చాలా హ్యాపీగా ఉన్నారు.
మహేష్ బాబు యు ట్యూబ్ చానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


