నందమూరి కుటుంబాన్ని పరామర్శించిన మహేష్ బాబు !

Published on Sep 1, 2018 10:06 am IST

తెలుగుదేశం పార్టీ సినీయ‌ర్ నాయ‌కుడు నందమూరి హరికృష్ణగారి మరణం సినీ రాజకీయ రంగాలకి తీరని లోటు మిగిల్చింది. ఇప్పటికే హరికృష్ణగారి మృతి పై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించి తమ సంతాపాన్ని తెలియజేశారు. కాగా హ‌రికృష్ణ‌కు స‌త్సంబంధాలున్న వారు ఈ సంద‌ర్భంగా హ‌రికృష్ణ‌తో త‌మ అనుబంధాన్ని నెమ‌రువేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.

అయితే సూపర్ స్టార్ మహేష్‌బాబు శుక్రవారం ఉదయం 11:30 గంటల సమయంలో మెహిదీపట్నం, ఎన్‌ఎండీసీ సమీపంలోని హరికృష్ణ నివాసానికి వచ్చిన ఆయన నందమూరి కుటుంబాన్ని ఓదార్చి తన సంతాపాన్ని తెలిపారు. మహేష్‌ బాబు దాదాపు గంటసేపు నందమూరి కుటుంబ సభ్యులతో గడిపినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :