అందరం ఫేక్‌ న్యూస్‌ లకు దూరంగా ఉందాం – మహేష్‌ బాబు

Published on Apr 7, 2020 4:15 pm IST

కరోనా మహమ్మారి పై మొదటి రోజు నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. కరోనా నివారణ పై అవగాహన పెంచడానికి మహేష్ తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వ కార్యక్రమాలన్నిటిలో కూడా ఆయన పరోక్షంగా పాల్గొంటూనే ఉన్నారు.

కాగా ఈ రోజు, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, మహేష్ వరుస ట్వీట్స్ ను పోస్ట్ చేస్తూ.. ‘ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని. భయంకరమైన కరోనాతో సమర్ధవంతంగా పోరాడాలని… అలాగే మరీ ముఖ్యంగా నెగెటివ్‌ పబ్లిసిటీకి మరియు ఫేక్‌ న్యూస్‌లకు దూరంగా ఉండాలని మహేష్‌ బాబు కోరారు.

మహేష్ బాబు లాక్ డౌన్ లో భాగంగా ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఈ ఖాళీ సమయాన్ని మిస్ అయిన సినిమాలను చూస్తూ.. అలాగే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మరింత దగ్గరగా ఉంటూ వారికి కరోనా పై అవగాహన కల్పిస్తున్నారు. మహేష్ మరో ట్వీట్ లో రెండు వారాల ఈ లాక్ డౌన్ లో మనం బలంగా ఉన్నాము. మన ప్రభుత్వాల కృషిని ఎంతో అభినందిస్తున్నాను, కరోనా పై పోరాటంలో ముందున్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పాలని మహేష్ తెలిపారు.

సంబంధిత సమాచారం :

X
More