టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన వైవిధ్యమైన చిత్రం ‘రావు బహదూర్’. ఈ చిత్రాన్ని జూలై 3న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు.
ఇదొక అద్భుతమైన, లోతైన ఎమోషనల్ డ్రామా అని.. సత్యదేవ్ తన పవర్‌ఫుల్ నటనతో సినిమాను వండర్‌ఫుల్‌గా లీడ్ చేశాడని కొనియాడాడు. దర్శకుడు వెంకటేష్ మహా సృష్టించిన ఈ వినూత్న ప్రపంచం తనను ఎంతగానో ఆకట్టుకుందని.. జూలై 3న థియేటర్లలో ఈ క్రేజీ మూవీని ఎక్స్ పీరియన్స్ చేయాలని మహేష్ బాబు ప్రేక్షకులను కోరాడు.
సూపర్ స్టార్ ఇచ్చిన ఈ బిగ్ సపోర్ట్‌తో శ్రీ చక్రా ఎంటర్‌టైన్‌మెంట్స్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై సోషల్ మీడియాలో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. మరి జూలై 3న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారో చూడాలి.


