వైరల్ అవుతున్న మహేష్ త్రో బ్యాక్ స్టిల్..!

Published on Jun 9, 2021 12:00 pm IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ మాస్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ కి పనులు అన్నీ జరుగుతుండగా మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది.

మరి గ్యాప్ లో మహేష్ ఫ్యాన్స్ కి ఓ త్రో బ్యాక్ స్టిల్ మంచి కిక్ ఇస్తుంది. సూపర్ స్టార్ మహేష్ చేసిన ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో ఒళ్ళు హూనం అయ్యేలా కష్టపడిన వైవిధ్యభరిత చిత్రం “1 నేనొక్కడినే”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మహేష్ నుంచి కనిపించిన ప్రతి యాస్పెక్ట్ కూడా ఇప్పటికీ మంచి ట్రీట్ ఇచ్చింది.

మరి ఈ చిత్రం నుంచి వచ్చిన ఓ స్టిల్ నే సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతుంది. అది ఈ చిత్రం దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఎనర్జిటిక్ నెంబర్ సయొనారా సాంగ్ నుంచి అన్నట్టు అర్ధం అవుతుంది. మొత్తానికి మాత్రం ఈ త్రో బ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో మాంచి స్పీడ్ గా వైరల్ అవుతుంది. అలాగే మహేష్ నుంచి అప్డేట్ కూడా వచ్చే ఆగష్టు 9న ఉంటుందని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :