మహేష్ చెప్పి మరీ కొడుతున్నాడు

Published on Oct 14, 2019 8:17 am IST

స్పైడర్ మూవీ ఫలితంతో ఊహించని షాక్ తిన్న మహేష్ భరత్ అనే నేను సినిమాతో విజయాల బాట పట్టారు. అయన లేటెస్ట్ మూవీ మహర్షి కూడా సూపర్ హిట్ సాధించింది. ఈ రెండు చిత్రాల విడుదలకు ముందు మహేష్ ఖచ్చితంగా హిట్ కొడతాం అని చెప్పిమరీ హిట్స్ అందుకున్నారు. మహర్షి, భరత్ అనే నేను సినిమాలు ఖచ్చితంగా ఫ్యాన్స్ ప్రౌడ్ గా ఫీలయ్యే సినిమాలు అవుతాయని ఆయన ఆయా సినిమాల విడుదలకు ముందే చెప్పడం జరిగింది.

కాగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ మూవీ విజయం పై కూడా మహేష్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు అని తెలుస్తుంది. నిన్న ఓ షాప్ ఓపెనింగ్ కొరకు విజయవాడ వెళ్లిన మహేష్, ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా సరిలేరు నీకెవ్వరూ మూవీ తన అభిమానులు గర్వించేంత గొప్పగా ఉంటుందని, మూవీ సూపర్ హిట్ సాధిస్తుందని, చెప్పారు. ఈ మాటలకు మహేష్ ఫ్యాన్స్ ఆనందం ఆకాశానికి తాకింది. సరిలేరు నీకెవ్వరూ మూవీ తో హ్యాట్రిక్ హిట్ కి సిద్దమైన మహేష్, ఈ మూవీ విజయ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని అర్థం అవుతుంది. గత చిత్రాల మాదిరే సరిలేరు నీకెవ్వరూ మూవీ విషయంలో కూడా మహేష్ చెప్పి మరీ హిట్ కొడతారని ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు.

సంబంధిత సమాచారం :

X
More