దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమా ‘వారణాసి’. ఐతే, మహేష్ బాబు గత కొన్ని నెలలుగా ‘వారణాసి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కానీ, ఇప్పుడు, మహేష్ బాబు తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఒక చిన్న విహారయాత్రకు బయలుదేరుతూ, ఆర్‌జీఐఏ విమానాశ్రయంలో కనిపించారు. వారు విమానాశ్రయంలో కనిపించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో, మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ నుండి కొద్దికాలం విరామం తీసుకున్నారని క్లారిటీ వచ్చింది.
మళ్లీ మహేష్ జూలై 1, 2026 నాటికి తిరిగి వారణాసి షూట్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. అన్నట్టు మహేష్ అభిమానులకు ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కనుల విందుగా ఉంటుందని టాక్. ప్రియాంక ఈ సినిమాలో మందాకినిగా కనిపిస్తూ ఉండగా.. మహేశ్ రుద్రగా.. శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా ‘వారణాసి’ చిత్రం రూ.1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను కెఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా, కథా కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. ఇక ఈ సినిమాకి దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా IMAX ఫార్మాట్లో చిత్రీకరిస్తుండగా, పలు భాషల్లో విడుదల చేయనున్నారు.


