ఇంటికి మరిన్ని కండిషన్స్ పెట్టిన మహేష్ బాబు

Published on May 18, 2021 1:00 am IST

కరోనా సెకండ్ వేవ్ ఇంకా ఉధృతంగానే ఉంది. ఎవరికి వారు సెల్ఫ్ ఐసోల్ అసోలేషన్లో ఉండటమే వైరస్ బారిన పడకుండా చేసే ఏకైక మార్గం. సినీ హీరోలు కూడ దీన్నే పాటిస్తున్నారు. గత లాక్ డౌన్ సమయంలో కూడ ఇళ్లకు పరిమితమైన హీరోలు చాలామంది మధ్యలో కథలు వినడం లాంటివి చేశారు. కానీ ఈసారి అది కూడ రిస్క్ అనే అనిపిస్తోంది. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు జాగ్రత్తలను మరింత కఠినతరం చేసుకున్నారు. బయటి వ్యక్తులు ఎవ్వరినీ కలవట్లేదట ఆయన. కనీసం కథలు వినే పని కూడ పెట్టుకోవట్లేదట.

కేవలం తన ఇంట్లో విధులు నిర్వహించే వారిని మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తున్నారట. అది కూడ రోజువారీ విధులు చేసే ముఖ్యమైన వ్యక్తులకే ఎంట్రీ. ఇది మాత్రేమే కాదు నిత్యం తమతో టచ్లో ఉండే సిబ్బంది అందరికీ సొంత ఖర్చులతో తరచూ వైద్య పరీక్షలు చేయిస్తున్నారట. ఎప్పటికప్పుడు ఇంట్లోని సభ్యులందరి హెల్త్ కండిషన్స్ చెక్ చేయిస్తున్నారట. అలా మహేష్ కోవిడ్ సెకండ్ వేవ్ తాకిడికి చాలా సీరియస్ గానే పరిగణించి తన జాగ్రత్తల్లో తాను ఉన్నారు. ఇకపోతే ఆయన ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్నారు. అది పూర్తవగానే త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేస్తారు.

సంబంధిత సమాచారం :