లడఖ్ లో స్టెప్స్ వేస్తున్న మహేష్ బాబు – తమన్నా

లడఖ్ లో స్టెప్స్ వేస్తున్న మహేష్ బాబు – తమన్నా

Published on May 20, 2014 6:18 PM IST

mahesh-babu-and-tamanna
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. కొద్ది రోజుల క్రితం వరకూ హైదరాబాద్ లో షూట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి లడఖ్ లో జరుగుతోంది. ఈ రోజు నుంచి మహేష్ బాబు – తమన్నాలపై ఓ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. అలాగే ఈ షెడ్యూల్ లో లడఖ్ లో కొన్ని కీలక సన్నివేశాలను కూడా షూట్ చేయనున్నారు.

ప్రస్తుతం లడఖ్ లో ఉష్ణోగ్రత 5 డిగ్రీలు, ఇలాంటి వెదర్ కండిషన్ లో కూడా మహేష్ బాబు, అతని టీం షూటింగ్ ఆపకుండా పనిచేస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. నిన్ననే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైన ఈ భారీ బడ్జెట్ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు