“సర్కార్ వారి పాట”పై మహేశ్ టార్గెట్ ఫిక్స్..!

Published on Jul 4, 2021 2:19 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం సర్కారు వారి పాట. మైత్రి మూవీస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి విడుదలకు ఈ సినిమా షెడ్యూల్ అయినప్పటికీ కరోనా సెకండ్‌ వేవ్‌ పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్స్ పడింది.

అయితే కరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే కాస్త చక్కబడుతుండడంతో ఈ సినిమా తాజా షెడ్యూల్‌ జూలై 15నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమవుతున్నట్టు సమాచారం. ఈ నేపధ్యంలోనే ఈ సినిమాపై హీరో మహేశ్ బాబు ఓ టార్గెట్‌ను ఫిక్స్ చెసుకున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబరు నెలకల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తిగా కంప్లీట్ చేసుకోవాలని ఆయన భావిస్తున్నారట. ఈ సినిమాల తర్వాత మహేశ్ తన తదుపరి ప్రాజెక్టుల్లో బిజీ అయిపోవాలని అనుకుంటున్నారట.

సంబంధిత సమాచారం :