
మరో 9 రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేయనుంది. ఆగష్టు 7న ఈ సినిమాని ఒక్క తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. తమిళంలో ఈ సినిమాకి ‘సెల్వందన్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు తమిళ వెర్షన్ కి ఓన్ గా డబ్బింగ్ చెప్పనున్నాడు. మహేష్ బాబు బాల్యం, కాలేజ్ డేస్ అన్నీ చెన్నైలోనే గడిచాయి, తమిళంలో చాలా బాగా మాట్లాడగలడు మహేష్ బాబు.
అందుకే ఈ సినిమాకి తన ఓన్ డబ్బింగ్ చెప్పడానికి సిద్దమయ్యాడని అంటున్నారు. ఈ సినిమాలో పని చేసిన కొందరు నటులు కూడా మహేష్ బాబు తమిళ్ మాట్లాడటం చూసి షాక్ అయ్యారు. అంతే కాక మహేష్ బాబు తన తదుపరి సినిమాని తెలుగు, తమిళ భాషల్లో షూట్ చేసి, రిలీజ్ చేయనున్నారు. దాంతో ఈ సినిమా అనుంచే తన వాయిస్ ని తమిళ వారికి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు. శ్రీమంతుడు తమిళ వెర్షన్ ఆడియో ‘సెల్వందన్’ ఆడియో జూలై 31న చెన్నైలో జరగనుంది. మహేష్ తో పాటు టీం మెంబర్స్ అందరూ ఈ వేడుకకి హాజరు కానున్నాడు.
మహేష్ బాబు మొదటిసారి శృతి హాసన్ తో జోడీ కట్టిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. మిర్చి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు నిర్మించారు.

