లైగర్ రిజల్ట్ ను బట్టే మహేష్ నిర్ణయం !

Published on Jul 5, 2021 11:24 pm IST


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పోయిన లాక్ డౌన్ లోనే మహేష్ బాబు కోసం ఓ స్క్రిప్ట్ ను రెడీ చేశానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే పూరి తన కథను ఇప్పటికే మహేష్ కి వినిపించాడని తెలుస్తోంది. కానీ, మహేష్ నుండి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదట. నిజానికి గత ఏడాదిలోనే మహేష్ బాబుకు పూరి ఒక కథను వినిపించాడు. అప్పుడు మహేష్ కి కథ నచ్చలేదు. మళ్ళీ మార్పులు చేసుకుని ఈ మధ్య అదే కథను మళ్ళీ చెప్పినట్లు తెలుస్తోంది.

కథ పై మహేష్ ఇంట్రెస్ట్ గానే ఉన్నాడు. కానీ సినిమాని మాత్రం ఫైనల్ చేయలేదు. మహేష్ లిస్ట్ లో రానున్న సినిమాల్లో రాజమౌళి సినిమా కూడా ఉంది. అందుకే మహేష్ కథ నచ్చినా వెంటనే డేట్స్ ఇవ్వడం లేదు. అయితే ప్రస్తుతం పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండతో “లైగర్” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిజల్ట్ ను బట్టి, మహేష్, పూరితో సినిమా విషయం పై ఫైనల్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడట. మరి ఈ సినిమా హిట్ అయితేనే మహేష్ తో పూరి సినిమా ఉంటుంది.

సంబంధిత సమాచారం :