ఎన్టీఆర్ ని నామినేట్ చేసిన మహేష్ బాబు !

Published on Aug 9, 2020 3:27 pm IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలో మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పాల్గొన్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మహేష్ పాల్గొని తన తోటలో ఒక మొక్క‌ను నాటారు. పైగా తన తోటి స్టేర్ హీరోలు ఎన్టీఆర్ మరియు తమిళ హీరో విజయ్ అలాగే హీరోయిన్ శ్రుతి హాసన్ ను కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినేట్ చేసాడు.

ఈ సందర్భంగా మహేష్ మెసేజ్ పోస్ట్ చేస్తూ.. “నా పుట్టినరోజును జరుపుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం ఇంకొకటి ఉండదు. నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. పచ్చటి ప్రపంచం వైపు ఒక అడుగు వేద్దాం. అని తన అభిమానులను ఉద్దేశించి మహేష్ ట్వీట్ చేస్తూ అన్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ప్రారంభించినందుకు తెలంగాణ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు మహేష్ కృతజ్ఞతలు తెలిపారు.

ఏమైనా సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. రోజు రోజుకు మారుతున్న వాతావరణం, పెరుగుతున్న కాలుష్యంతో మనం భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే మనందరం మొక్కలు నాటాలి. వాటిని సంర‌క్షించాలి. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలి అనే కాన్సెప్ట్ వచ్చిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలో అందరూ పాల్గొనాలి.

సంబంధిత సమాచారం :

More