మహేష్, బన్నీ సంక్రాంతి చిత్రాల ప్రభంజనం

Published on Jan 29, 2020 10:30 pm IST

2020 సంక్రాంతి సినిమాలు అనేక రికార్డ్స్ నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే అల వైకుంఠపురంలో చిత్రం బన్నీ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్సింగ్ సాధించిన చిత్రంగా నిలువగా, సరిలేరు నీకెవ్వరు మహేష్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ఇక ఈ రెండు చిత్రాలు 15 టౌన్స్ లో 1 కోటికి పైగా షేర్ సాధించి మరో రికార్డు సాధించాయి. ఆంధ్రప్రదేశ్ లో అల వైకుంఠపురంలో మరియు సరిలేరు నీకెవ్వరు సమానంగా 15 టౌన్స్ నందు ఒక కోటికి పైగా షేర్ సాధించిన చిత్రాలుగా నిలిచాయి. ఇక విషయంలో బాహుబలి 2, ఏపీ లో 23టౌన్స్ లో ఒక కోటికి పైగా షేర్ సాధించిన చిత్రంగా టాప్ లో కొనసాగుతుంది.

ఇక బాహుబలి 14 టౌన్స్ తో నాలుగువ స్థానములో ఉండగా, 13టౌన్స్ లో ఒక కోటికి పైగా షేర్ వసూలు చేసిన చిత్రంగా రంగస్థలం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఐదు చిత్రాలు టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నాయి. ఇక భారీ బడ్జెట్ తో మెగాస్టార్ హీరోగా దర్శకుడు సురేంధర్ రెడ్డి తెరకెక్కించిన సైరా 9 టౌన్స్ లో ఒక కోటికి పైగా షేర్ వసూలు చేసింది. ఇలా ఈ సంక్రాంతి చిత్రాలు తెలుగు రాష్ట్రాలలో భారీగా వసూళ్లు దక్కించుకున్నాయి.

సంబంధిత సమాచారం :