దూకుడు నిర్మాతకు మహేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు

దూకుడు నిర్మాతకు మహేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు

Published on Oct 19, 2019 9:44 AM IST

సూపర్ స్టార్ మహేష్ నిర్మాత అనిల్ సుంకర కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు ఆయన జన్మదినం నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా, ఆయనకు ఆయురారోగ్యాలు బాగుండాలని, నిర్మాతగా మంచి విజయాలు అందుకోవాలని కాంక్షించారు. అనిల్ సుంకర మహేష్ ల స్నేహం చాలా ప్రత్యేకమైనది. 14రీల్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపి ఆచంట లతో కలిసి ఈయన నిర్మించిన దూకుడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

ఆతరువాత ఇదే బ్యానర్ లో సుకుమార్ దర్శకత్వంలో నేనొక్కడినే, మళ్ళీ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆగడు చిత్రాలు చేశారు. సరిలేరు నీకెవ్వరూ మూవీ వీరికి నాలుగవ చిత్రం. ఈ మూవీ నిర్మాత భాగస్వామ్యంలో దిల్ రాజు, మహేష్ కూడా ఉన్నారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తుండగా , దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల అవవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు