మొత్తం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన మహేష్.!

Published on Jun 9, 2021 4:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్ పై హీరోగానే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎందరో నిస్సహాయులకు అండగా నిలిచి తన ఉన్నతమైన మనసు చాటుకున్నారు. అలా ఇప్పటికే ఎందరో వేలాది చిన్నారి గుండెలను కాపాడిన మహేష్ మొన్న తన తండ్రి నటశేఖర కృష్ణ గారి జన్మదినం సందర్భంగా తన జన్మస్థలం మరియు తాను దత్తత తీసుకున్న గ్రామం బుర్రిపాలెం మొత్తానికి ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు.

మరి గత మే 31న ప్రారంభించిన ఈ ప్రక్రియ నేటితో ముగిసినట్టుగా మహేష్ సతీమణి నమ్రత ఘట్టమనేని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ఈ వారం రోజుల వాక్సినేషన్ పూర్తి చేసినందుకు మహేష్ కి స్పెషల్ థాంక్స్ తెలియజేస్తున్నాని అలాగే ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్స్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాని నమ్రత తెలిపారు. ఇలా మొత్తానికి మహేష్ చేపట్టిన మరో గ్రేట్ మూవ్ విజయవంతం అయ్యింది.. ప్రస్తుతం మహేష్ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అలాగే త్రివిక్రమ్ తో మరో సినిమా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :