ఏమైనా…,మహేష్ పూర్తిగా మారిపోయాడబ్బా…!

Published on Oct 7, 2019 9:11 am IST

సూపర్ స్టార్ మహేష్ పూర్తిగా మారిపోయాడు, ఒకప్పటి మహేష్ వేరు..,నేటి మహేష్ వేరు. సాధారణంగా మిత భాషి అయిన మహేష్ ఒకప్పుడు పబ్లిక్ ఈవెంట్స్, మూవీ వేడుకలు, విజయోత్సవ సంబరాలు వంటి కార్యక్రమాలలో అస్సలు కనిపించేవారు కాదు. ఆచితూచి మాట్లాడుతూ, వివాదాలకు దూరంగా ఉండే మహేష్ సినిమాలలో తప్పించి బయట కనిపించడం చాలా అరుదుగా జరిగేది. ఇన్నేళ్ల మహేష్ కెరీర్ లో ఒక్క వివాదంలో కూడా ఆయన లేకపోవడం విశేషం.

కానీ మహేష్ గత కొంత కాలంగా పూర్తిగా మారిపోయారు. ఆయన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారు. సమకాలీన సామజిక, రాజకీయ అంశాలపై తన స్పందన తెలియజేస్తున్నారు. తోటి హీరోల మూవీల పట్ల తన అభిప్రాయం తెలియజేస్తున్నారు. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేకున్నా నచ్చిన సినిమాపై ప్రశంలు కురిపిస్తున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఇతర హీరోలతో మహేష్ కనిపించిన దాఖలాలు ఉండేవి కావు, అలాంటిది మహేష్, చరణ్,ఎన్టీఆర్ లతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగివుంటున్నారు. వీరందరూ కలిసి ఫ్యామిలీ పార్టీలలో పాల్గొనడం విశేషం.

ఇక భార్యా పిల్లలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే మహేష్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కుటుంబానికి సమయం కేటాయించి వారితో గడుపుతారు. ఇలా మహేష్ ఒకప్పటి బిడియం వదిలేసి సామజిక జీవిగా మారిపోయారు. ఈ మార్పు ఆయనను అభిమానులకు మరింత దగ్గర చేయడమే కాకుండా, మహేష్ పట్ల మరింత గౌరవం పెరిగేలా చేసింది.

సంబంధిత సమాచారం :

More