దేశాలకు దేశాలే చుట్టేస్తున్న మహేష్ !

Published on Jun 5, 2019 10:52 pm IST

‘మహర్షి’ సక్సెస్ మహేష్ బాబుకు ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. ఏ సినిమా విజయాన్నీ ఆస్వాదించనంతగా ‘మహర్షి’ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు ఆయన. సినిమా విడుదలయ్యాక తన విజయానందాన్ని ఇక్కడి ప్రేక్షకులతో, రైతులతో, విద్యార్థులతో పంచుకున్న మహేష్ కుటుంభ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి విదేశాలకు వెళ్లారు.

గత కొన్ని రోజులుగా భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి జర్మనీలో సెలబ్రేషన్స్ చేసుకున్న ఆయన ఈరోజు ఇటలీ బయలుదేరి వెళ్లారు. అక్కడే కొన్నిరోజుల పాటు ఉండి ఇంకాస్త ఎంజాయ్ చేయనున్నారు. ట్రిప్ ముగిసి ఇండియాకు వచ్చిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా రష్మిక మందన్న నటించనుంది.

సంబంధిత సమాచారం :

More