బక్రీద్ శుభాకాంక్షలు చెప్పిన మహేష్

Published on Aug 1, 2020 5:59 pm IST

సూపర్ స్టార్ మహేష్ పూర్తిగా సోషల్ మీడియా జీవి అయ్యారు. ఆయన ప్రతి సామాజిక మరియు రాజకీయ అంశంపై స్పందిస్తూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. కాగా నేడు ముస్లిం సోదరుల పర్వదినం బక్రీద్ కావడంతో మహేష్ బెస్ట్ విషెస్ తెలిపారు. బక్రీద్ రోజున ప్రపంచ సోదర స్ఫూర్తిని ప్రదర్శించడం ఆనందంగా ఉంటుందని, ఈ సంతోషకరమైన సందర్భం సమస్యాత్మక సమయాల్లో మనందరినీ ఒకచోట చేర్చి, మనలో చైతన్యం నింపుతుందని, కొత్త ఆరంభం కోసం ఆశిస్తున్నామని మహేష్ తన ట్వీట్‌ లో పేర్కొన్నారు .

మహేష్ ట్విట్టర్ మెస్సేజ్ ముస్లిం సోదరులలో జోష్ నింపింది. ఇక మహేష్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు పరుశురాం తో కమిటైన సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నుండి మొదలుకానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More