మహేష్ వరుసగా ఆ క్రేజీ డైరెక్టర్స్ తో చేస్తున్నారట.

Published on Feb 8, 2020 3:04 pm IST

మహేష్ మరోమారు టాలీవుడ్ లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ సంక్రాంతి మూవీ సరిలేరు నీకెవ్వరు టాలీవుడ్ ఆల్ టైం టాప్ 4 హైయెస్ట్ గ్రాస్సర్ గా నిలిచింది. ఇది వరుసగా మహేష్ కి హ్యాట్రిక్ హిట్ కావడం విశేషం. భరత్ అనే నేను, మహర్షి చిత్రాలతో పాటు సరిలేరు నీకెవ్వరు వరుసగా విజయాలు అందుకున్నాయి. కాగా మహేష్ తన తదుపరి చిత్రాలు కూడా ఫైనల్ చేసి ఉంచారని తెలుస్తుంది. వంశీ పైడిపల్లి తో ఇప్పటికే మూవీ ప్రకటించేసిన మహేష్ మే నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

ఇక మహేష్ తన 28వ చిత్రం అల వైకుంఠపురంలో చిత్రంతో నాన్ బాహుబలి రికార్డ్స్ అందుకున్న త్రివిక్రమ్ తో చేయనున్నారట. అనంతరం ఆయన మళ్ళీ అనిల్ రావిపూడితో ఒక చిత్రం దాని తరువాత మహేష్ కి రెండు విజయాలు అందించిన దర్శకుడు కొరటాల శివతో సినిమా చేస్తారట. ఇలా వంశీ పైడిపల్లి చిత్రం తరువాత ఆయన వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ సిద్ధం చేసి వుంచారట. మరి వీటిలో ఎన్ని కార్యరూపం దాల్చనున్నాయో చూడాలి. త్రివిక్రమ్ తో మహేష్ మూవీ చేసి చాలా కాలం అవుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అతడు. ఖలేజా వంటి చిత్రాలు వచ్చాయి.

సంబంధిత సమాచారం :