మహేష్ ని విషాదంలోకి నెట్టిన సంఘటన..!

Published on Aug 8, 2020 9:08 am IST

నిన్న కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్ట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. 190మంది ప్రయాణికులతో కూడిన విమానం లాండింగ్ సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్స్ తో పాటు మొత్తం 17మంది మరణించినట్లుగా తెలుస్తుంది. దేశాన్ని ఈ సంఘటన తీవ్ర విషాదంలోకి నెట్టింది. కాగా ఈ ఘటనపై మహేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సంఘటన పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మహేష్ ట్విట్టర్ లో ”కోజికోడ్ విమానప్రమాద ఘటన కలచివేసింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికిని నా సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడివారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు. 2020 లో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లెబనాన్ రాజధానిలో జరిగిన భారీ పేలుడు వందల మందిని పొట్టన పెట్టుకుంది. ఓ ప్రక్క కరోనా వైరస్ తో అల్లాడుతున్న ప్రప్రంచం ఇలాంటి దుర్ఘటనలతో బెంబేలెత్తుతుంది.

సంబంధిత సమాచారం :

More