మహేష్ చేసిన ఆ మంచిపని తెలిస్తే…మెచ్చుకోకుండా ఉండలేం

Published on Jun 18, 2019 8:14 am IST

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం “భరత్ అనే నేను”,”మహర్షి” వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఊపుమీదున్నారు.ఇటీవలే ఫ్యామిలీతో వరల్డ్ టూర్ పూర్తి చేసుకొచ్చిన మహేష్ ఈనెల 26నుండి అనిల్ రావిపూడి దర్శకుడిగా తెరకెక్కనున్న “సరిలేరు నీకెవ్వరు” మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారు.

ఐతే తాజాగా మహేష్ గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పడు బయటికొచ్చింది. ప్రిన్స్ మహేష్ గత మూడేళ్ళుగా దాదాపు 1000 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించారట. ఇటీవల ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా వేదికా పంచుకుంది. ఆంధ్ర హాస్పిటల్స్, ఇంగ్లాండ్ కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండషన్ సంస్థల ఆద్వర్యంలోమహేష్ బాబు ఈ అద్భుత కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు నమ్రత తెలిపింది.

పబ్లిసిటీని అంతగా ఇష్టపడని మహేష్ ఇప్పటివరను ఈ విషయాన్ని ఎవరితో పంచుకోకపోవడం గమనార్హం. ఇప్పుడు ఈ విషయం బయటకు పొక్కటంతో మహేష్ ఫ్యాన్స్ తన అభిమాన హీరో చేసిన మంచి పనికి పొంగిపోతున్నారట. గతంలో శ్రీమంతుడు సినిమా తరువాత ఆ స్పూర్తితో తన సొంత గ్రామమైన మహేష్ బాబు బుర్రిపాలెంను దత్తతతీసుకొని అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More