మహేష్ నుంచి దారుణంగా ఈ అంశాన్ని మిస్సవుతున్నారు.!

మహేష్ నుంచి దారుణంగా ఈ అంశాన్ని మిస్సవుతున్నారు.!

Published on Dec 6, 2020 8:10 PM IST

Mahesh 1
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా సెటిల్ అయిన అనతి కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో కనీ వినీ ఎరుగని రికార్డులను నెలకొల్పాడు. పోకిరి నుంచి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చుకున్న మహేష్ తర్వాత సినిమాలతో పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయినా తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రతీ సినిమాలో మైంటైన్ చేసుకుంటూ వచ్చారు.

ముఖ్యంగా లాంగ్ హెయిర్ స్టైల్ లో మహేష్ ను పోకిరి, సైనికుడు, అతిధి లో మాస్ యాంగిల్ మరియు యాటిట్యూడ్ లను మహేష్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు.అయితే వాటి తర్వాత మహేష్ సాలిడ్ హిట్స్ అందుకోలేదా అంటే అందుకున్నారు కానీ క్యారక్టరైజేషన్ పరంగా ఈ సినిమా రోల్స్ తో మహేష్ ఫ్యాన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు.

సరిగ్గా ఇప్పుడు మహేష్ అదే తరహా లుక్స్ లో దర్శనం ఇస్తుండే సరికి సినిమాల ఫలితాలు ఏమో కానీ ఆ టైం లో ఎనర్జిటిక్ అండ్ యాటిట్యూడ్ రోల్ పడితే చాలు మిగతాది మేము చూసుకుంటాము అన్న రేంజ్ లో మహేష్ ఫ్యాన్స్ ఫిక్సయ్యిపోయారు. పైగా వరుసగా మూడు భారీ బ్లాక్ బస్టర్ లు లాస్ట్ గా చేసిన “సరిలేరు నీకెవ్వరు”లో మైండ్ బ్లాక్ సాంగ్ తో పాత మహేష్ ను గుర్తు చెయ్యడం..

ఇప్పుడు లాంగ్ హైర్ తో మళ్ళీ గుర్తు చేస్తుండడంతో పరశురామ్ తో ప్లాన్ చేసిన “సర్కారు వారి పాట”లోని ఎలాంటి రోల్ ను డిజైన్ చేస్తారా అన్న దాని కోసమే ఎదురు చూస్తున్నారు. మొత్తానికి వింటేజ్ మహేష్ ను చాలా దారుణంగా మిస్సవుతున్న మహేష్ ఫ్యాన్స్ “సర్కారు వారి పాట”లో పరశురామ్ ఏమన్నా ఆ యాంగిల్స్ ను టచ్ చేస్తే మాస్ సెలబ్రేషన్స్ ను మరో లెవెల్లో ప్లాన్ చేస్తారని చెప్పాలి.

తాజా వార్తలు