“సర్కారు వారి పాట” ఫస్ట్ లుక్ కి గట్టి ప్లాన్సే వేస్తున్నారు.!

Published on May 13, 2021 11:30 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా మహేష్ ఫ్యాన్స్ మాత్రం రానున్న ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం గట్టి ప్లాన్ లే వేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఆల్రెడీ అందరినీ అలర్ట్ చేసుకుంటూ లాస్ట్ టైం సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ రెస్పాన్స్ దాటి దీనికి మరో సరికొత్త రికార్డును సెట్ చెయ్యాలని చూస్తున్నారు. అలా మన టాలీవుడ్ మోస్ట్ లైక్డ్ అండ్ రీట్వీటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ గా నిలపాలన్నది వారి టార్గెట్..

మరి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో వారి ప్రిపరేషన్స్ తో ఎలాంటి రికార్డు సెట్ చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :