మేజర్ సిటీల్లో మహేష్ అభిమానుల భారీ ర్యాలీ.!

Published on Sep 18, 2014 10:00 am IST

aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆగడు’ రేపు భారీ ఎత్తున విడుదలకి సిద్దమైంది. ఈ సినిమా విడుదల సందర్భంగా ఇరు రాష్ట్రాల్లోనూ అభిమానులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడైనా సరే ఓ మంచి జరుగుతోంది అంటే అది అలా జరగా కూడదు అని కోరుకునే వారు కూడా ఉంటారు. అలా కోరుకునే వారి దిష్టి ‘ఆగడు’ సినిమాపై పడకూడదని అభిమానులు పలు నగరాల్లో దిష్టి పూజలు నిర్వహించనున్నారు.

హైదరబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి నగరాల్లో ఉదయాన్నే అభిమానులు ‘ఆగడు’ సినిమాపై ఉన్న దిష్టి పోయేలా పూజలు చేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలు దేరి థియేటర్స్ కి చేరుకోనున్నారు. దీనికోసం ఇప్పటికే అభిమాన సంఘాలు ఆయా ప్రాంతాల్లో పలు ప్లాన్స్ చేసుకున్నారు.

మహేష్ బాబు మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన ‘ఆగడు’ లో తమన్నా హీరోయిన్ గా నటించింది. రాజేంద్ర ప్రసాద్, నదియా, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్.

సంబంధిత సమాచారం :