చవితి సందర్భంగా మహేష్ ట్రెడిషనల్ లుక్.

చవితి సందర్భంగా మహేష్ ట్రెడిషనల్ లుక్.

Published on Sep 2, 2019 10:07 AM IST

mahesh babu

నేడు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సూపర్ స్టార్ మహేష్ తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా “అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు, ఆ దేవుని కృప మీ జీవితాలను సంతోషమయం చేయాలని కోరుకుంటున్నాను” అని ట్విట్టర్ వేదికగా స్పందించారు. శుభాకాంక్షలతో పాటు ఆయన పోస్ట్ చేసిన ఫోటోలో మహేష్ సాంప్రదాయ వస్త్ర ధారణలో అలరించారు. గోల్డ్ మరియు మెరూన్ కలర్స్ కాంబినేషన్ లో ఉన్న కుర్తా ధరించిన మహేష్ లుక్ వైవిధ్యంగా అలరించింది.

ప్రస్తుతం మహేష్ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. మహేష్ కి జంటగా రష్మిక మందాన నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ కీలకపాత్ర చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు