ఎన్టీఆర్ దారిలోనే మహేష్ బాబు కూడ !

ఎన్టీఆర్ దారిలోనే మహేష్ బాబు కూడ !

Published on Jun 28, 2018 4:14 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ కోసం కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ సినిమాలో రెండు భిన్నమైన లుక్స్ లో కనిపించనున్నారు మహేష్. వాటిలో ఒకటి స్టూడెంట్ లుక్. ఈ లుక్ కోసం ఆయన ఇప్పటికే కొంత బరువు తగ్గగా ఫిట్నెస్ కోసం కఠినమైన కసరత్తులు మొదలుపెట్టారు. ఇందు కోసం గతంలో ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపించడానికి వ్యక్తిగత కోచ్ ను పెట్టుకుని కష్టపడినట్టే మహేష్ కూడ కష్టపడుతున్నారు.

ఇప్పటికే ట్రైనింగ్ సెషన్స్ మొదలుపెట్టిన ఆయన అవుట్ డోర్ లొకేషన్స్ లో కూడ అదే ట్రైనర్ తో పనిచేస్తూ త్వరలోనే ఫుల్ ఫిట్ గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు ఉదయం మహేష్ యొక్క తాజా లుక్ ఒకటి బయటికొచ్చింది. దాన్ని చూస్తే మహేష్ ఇంకొద్ది రోజుల్లో అనుకున్న తరహాలో బాడీ బిల్డ్ చేయగలరని అనిపిస్తోంది. దిల్ రాజు, అశ్విని దత్ లు నిర్మిస్తున్న ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు