మాసివ్ అప్డేట్..బాక్సాఫీస్ బ్లాస్ట్ కి బకెల్ బిగించిన మహేష్.!

Published on Aug 7, 2021 4:14 pm IST


అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్నారు. మరి ఈ నేలలోకి అడుగు పెట్టడమే మహేష్ బర్త్ డే కానుకగా అదిరే అప్డేట్స్ ఇస్తూ వస్తున్న మేకర్స్ ఇప్పుడు మరో సాలిడ్ అనౌన్స్మెంట్ ని ఈరోజు ఇస్తున్నామని సడెన్ అప్డేట్ ఇచ్చారు.

ఒక స్పెషల్ ‘గిఫ్’ట్ ను ఇస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. ఈ గిఫ్ట్ మాత్రం సాలిడ్ గానే ఉందని చెప్పాలి. సరైన యాక్షన్ సీక్వెన్స్ కి ముందు బెల్ట్ బకెల్ లాక్ చేస్తున్నట్టుగా మహేష్ ని ఇందులో చూపించారు. ఇది మాత్రం మాసివ్ గా అనిపిస్తుంది.. చిన్నదే అయినా మహేష్ తో బాక్సాఫీస్ పైకి గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాని చెప్పాలి.

అలాగే ఇందులోనే ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని కూడా ఇచ్చేసారు. రానున్న ఆగష్టు 9న మేకర్స్ ఈ సినిమా నుంచి ప్లాన్ చేసిన బ్లాస్టర్ ను ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఫిక్స్ చేసినట్టుగా తెలిపారు.మరి ఈ బ్లాస్టర్ ఎలా ఉంటుందో చూడాలి. అంతే కాకుండా పరశురామ్ పెట్ల మహేష్ అభిమానులకు మాత్రం మరో లెవెల్ ట్రీట్ ఇవ్వడం కూడా కన్ఫర్మ్ అని అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :