మహేష్ కాలేజ్ స్టూడెంట్ లుక్ అదుర్స్.!

మహేష్ కాలేజ్ స్టూడెంట్ లుక్ అదుర్స్.!

Published on Jul 29, 2015 1:36 PM IST

mahesh-babu
‘రాజకుమారుడు’, ‘యువరాజు’, ‘అర్జున్’ సినిమాల తర్వాత టాలీవుడ్ హన్డ్సం హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కాలేజ్ కి వెళ్ళే కుర్రాడిలా కనిపించలేదు. చాలా గ్యాప్ తర్వాత మహేష్ కాలేజ్ స్టూడెంట్ కనిపించనున్న సినిమా ‘శ్రీమంతుడు’. ట్రైలర్ మరియు సాంగ్ టీజర్స్ లో మహేష్ బాబుని కాలేజ్ స్టూడెంట్ లుక్ లో చూసిన అభిమానులు మహేష్ లుక్ విషయంలో ఫుల్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ చిత్ర టీం రీసెంట్ గా శ్రీమంతుడులో కాలేజ్ బ్యాక్ డ్రాప్ కి చెందిన కొన్ని మహేష్ బాబు ఫోటోలు రిలీజ్ చేసింది. అవి అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ని ఈ స్టిల్స్ మరింత అట్రాక్ట్ చేస్తున్నాయి. మహేష్ ని కాలేజ్ స్టూడెంట్ గా చూపించిన విధానం అదుర్స్ ఆని అందరూ అంటున్నారు. మేము ఈ కాలేజ్ ఎపిసోడ్ గురించి కనుక్కోగా.. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే రొమాంటిక్ సీన్స్ చాలా బాగుంటాయని, ప్రతి ఒక్కరిని ప్రేమలో పడేసేలా ఉంటాయని, అలాగే ఈ కాలేజ్ ఎపిసోడ్ చూసాక మహేష్ కి లేడీ అభిమానుల సంఖ్య మరింత పెరుగుతుందని ఈ చిత్ర టీం చెబుతోంది. కొరటాల శివ మహేష్ ని సరికొత్తగా చూపడంలో చాలా కేర్ తీసుకున్నాడని, లుక్ పరంగానే కాకుండా క్యారెక్టరైజేషన్ పరంగా కూడా చాలా కొత్తగా ఉంటుందని సమాచారం.

మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సుకన్య, రాహుల్ రవీంద్రన్, సనమ్ శెట్టి, పూర్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఆగష్టు 7న శ్రీమంతుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

తాజా వార్తలు