“సర్కారు వారి పాట” యూనిట్ కోసం మహేష్ ముందడుగు.!

Published on Jun 3, 2021 4:00 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మళ్ళీ పాత మహేష్ ని గుర్తు చేసే విధంగా దర్శకుడు పరశురామ్ పెట్ల ప్లాన్ చేస్తున్న విధానం కోసం మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పక్కా మాస్ ఎంటర్టైనర్ షూట్ ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తయ్యి రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ చేశారు కానీ ఆ కొద్ది లోనే కరోనా రెండో వేవ్ మూలాన తాత్కాలికంగా నిలిపివేశారు.

మరి ఇప్పుడు వచ్చే జూలై నుంచి షూట్ మళ్ళీ స్టార్ట్ కానుంది అని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో మరో ఆసక్తికర టాక్ బయటకి వచ్చింది. మొత్తం తన చిత్ర యూనిట్ కోసం మహేష్ ఓ ముందడుగు వేసి వారందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని డిసైడ్ అయ్యారట.. మరి ఇటీవలే తన తండ్రి నటశేఖర కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామం వాసులకు కూడా వ్యాక్సినేషన్ చేయించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :